News July 10, 2025

PDPL: జిల్లాలో బోడ కాకరకాయ కిలో ₹ 240

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూరగాయల మార్కెట్‌లలో బోడ కాకరకాయ ధర కిలో ₹ 240కి చేరింది. ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అందించే బోడ కాకరకాయ అంటే అందరికీ ఇష్టమే. ఈ సీజన్ ప్రారంభంలోనే కిలో ₹ 200 పైన ధర పలకడంతో వినియోగదారులు వామ్మో అంటున్నారు. కిలో చికెన్ ధరకు సరి సమానంగా మారింది. ధర ఎక్కువే అయినప్పటికీ బోడ కాకరకాయ కొనుక్కునేందుకు ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు.

Similar News

News July 10, 2025

17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

image

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల‌పై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.

News July 10, 2025

కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితులు: మంత్రి

image

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 31 మంది, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

News July 10, 2025

కోరుట్ల: గరుడ వాహనంపై విహరించిన వేంకటేశ్వరుడు

image

గురు పూర్ణిమ సందర్భంగా కోరుట్లలోని అతిపురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గరుడ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో జరిగే విశేష పూజలను కోరుట్లలో స్వామివారికి చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం పురవీధుల్లో గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.