News March 16, 2025
PDPL: డ్రగ్స్ నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: అదనపు కలెక్టర్

పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణు కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టే చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతిశాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు.
Similar News
News December 24, 2025
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News December 24, 2025
NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
News December 24, 2025
సీక్రెట్ శాంటా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా?

తుర్కియేలో 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తికి సీక్రెట్ శాంటా ఆలోచన వచ్చింది. 1979లో లేరీ డీన్ స్టివర్ట్ అనే అమెరికన్ అవసరంలో ఉన్న వారికి డబ్బు సహాయం చేయడంతో ఈ కల్చర్ పాపులర్ అయింది. ఒకప్పుడు వెస్టర్న్ కల్చర్‌గా ఉండే గిఫ్ట్ పాలసీ నేడు భారత్‌లోనూ ట్రెండ్‌గా మారింది. ఆఫీసుల్లో కొలీగ్స్ మధ్య సామరస్యాన్ని పెంచుతోంది. ఏది ఏమైనా ఎదుటి వారి మొహంలో కనిపించే నవ్వు నిజమైన గిఫ్ట్. మీరేమంటారు?


