News October 31, 2025
PDPL: ‘దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం, కలెక్టరేట్ IT ప్రాంగణం నుంచి చౌరస్తా వరకు నిర్వహించిన 2 కి.మీ. ‘యూనిటీ ఫర్ రన్’ ర్యాలీని ఆయన ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధ ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 1, 2025
చిట్యాల: అత్తగారిళ్లకు చేరినా.. చెరగని స్నేహం..!

బాల్య స్నేహితురాళ్లు పెళ్లై బాధ్యతలు పెరిగాక బాల్య మిత్రులను మర్చిపోతుంటారు. అత్తగారింటి ఆంక్షలు, కుటుంబ బాధల్లో చిక్కుకొని పలకరింపులే కరువైన రోజులివి. కాగా, ఓ బాల్య స్నేహితురాలు ఆపదలో ఉందని తెలుసుకొని ఆసరాగా నిలిచారు చిన్ననాటి స్నేహితురాళ్లు. భూపాలపల్లికి చెందిన నర్మద అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని చిట్యాల జడ్పీహెచ్ఎస్ 2006 టెన్త్ బ్యాచ్ మిత్రురాళ్లు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.
News November 1, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల జరుగుతాయని చెప్పారు. వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ప్రిన్సిపల్స్‌కు సూచించారు. ఈ విషయాన్ని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.


