News October 8, 2025
PDPL: ‘నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే’

ZPTC, MPTC మొదటి విడత ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు, ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల డిపాజిట్ రసీదు, మూడు పాస్‌పోర్ట్ ఫొటోలు సమర్పించాలి. పార్టీ అభ్యర్థులైతే తప్పనిసరిగా Bఫామ్ జతచేయాలి. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల ధృవపత్రంపై గెజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. ఎన్నికల వ్యయం నిర్వహణకు కొత్త బ్యాంకు ఖాతా ROకు సమర్పించాలి.
Similar News
News October 8, 2025
సయోధ్య సరే.. మంత్రుల మధ్య గ్రూపుల సంగతేంటి?

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య సయోధ్య సరే గాని, మంత్రుల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాల సంగతేంటని కాంగ్రెస్ శ్రేణులు అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం ఖాయమంటున్నాయి. అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించి నేతలను ఏకతాటి పైకి తీసుకువచ్చి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
News October 8, 2025
నరేంద్రపురం గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి

పి గన్నవరం మండలంలోని నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కోనసీమ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్రావు బుధవారం సందర్శించారు. గురుకుల పాఠశాల, కళాశాలల వద్ద బాలుర వసతి గృహాల వద్ద దోమల వ్యాప్తి ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.
News October 8, 2025
మక్తల్: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

మక్తల్ మండలం<<17905844>> సత్యారాం<<>> గ్రామంలో ఈనెల 3న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. భార్య వినోదను భర్త కృష్ణారెడ్డి హతమార్చినట్లు గుర్తించారు. వినోద తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణారెడ్డి ప్లాన్ ప్రకారం హైదరాబాద్ డిమార్టులో కత్తిని కొనుగోలు చేశాడు. దాన్ని స్కూటీలో పెట్టుకొని గ్రామానికి వెళ్లిన అతడు భార్యతో గొడవ పడి హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు.