News October 18, 2025
PDPL: నేటితో ముగియనున్న గడువు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం జోన్‌లలో 74 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటివరకు 566 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. నిన్న ఒక్కరోజులోనే 348 వచ్చాయన్నారు. నేటితో దరఖాస్తుల గడవు ముగియనుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 18, 2025
కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది: సూర్య

కెప్టెన్సీ కోల్పోతాననే భయం తనలో ఉందని IND T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. T20లకూ గిల్‌ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అబద్ధం చెప్పను. భయం ఉంటుంది. అదే నాకు మోటివేషన్. హార్డ్‌వర్క్ చేస్తూ నిజాయతీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్ అవడం పట్ల హ్యాపీగా ఉన్నా. మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది’ అని పేర్కొన్నారు.
News October 18, 2025
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తర్జనభర్జన

AP: విశాఖలోని <<17985023>>రుషికొండ<<>> ప్యాలెస్‌పై వివిధ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ కాన్సులేట్‌లు ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సూచించింది. ఏపీ నుంచి వేలాది మంది US, UAE సహ పలు దేశాల్లో నివసిస్తున్నందున NRI సేవలు సులభమవుతాయంది. లేకుంటే అంతర్జాతీయ హోటళ్లు నెలకొల్పాలని పేర్కొంది. దాదాపు ₹500 Crతో కట్టిన ఈ ప్యాలెస్ వినియోగం లేకపోగా, నిర్వహణ ఖర్చులకు నెలకు ₹25లక్షలు అవుతోంది.
News October 18, 2025
అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు మృతి

మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తల్లి, కూతుర్లు అమెరికాలో మృతి చెందారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాత విగ్నేశ్ సతీమణి రమాదేవి(52), కుమార్తె తేజస్వి(32)ని అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం సమయంలో జరిగిన ప్రమాదంలో ఇరువురు మరణించినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.