News October 13, 2025

PDPL: పోలీస్ సిబ్బందికి కిట్ల పంపిణీ

image

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందికి ఉన్ని దుప్పటి, వులెన్ జాకెట్, టీ- షర్ట్, రెయిన్‌కోట్, హవర్‌ సాక్స్ పంపిణీ చేశారు. వాతావరణ మార్పులు, క్షేత్రస్థాయి కష్టాలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు CUP తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు DCP శ్రీనివాస్, RIలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Similar News

News October 13, 2025

అనకాపల్లి జిల్లాలో 1.30 లక్షల గుంబూషియా చేపలు విడుదల

image

గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్ఓ సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు,కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్ లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో లార్వాను పూర్తిగా తినేస్తాయన్నారు.

News October 13, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 100 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News October 13, 2025

భీమవరం: నేటి పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.