News January 5, 2026
PDPL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం నాణ్యత పెంచాలి: కలెక్టర్

PDPL జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ANM రిజిస్ట్రేషన్ నుంచి ప్రసవానంతర ఫాలోఅప్ వరకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. NCD సర్వేను మార్చి నాటికి 100 శాతం పూర్తి చేయాలని, టీబీ రోగులకు చికిత్స, పోషకాహార కిట్లు అందించాలని సూచించారు. రోగులకు మెరుగైన సేవలు, మర్యాదపూర్వక ప్రవర్తన తప్పనిసరిగా ఉండాలన్నారు.
Similar News
News February 10, 2026
పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు బాధితులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి డీఎస్పీ వెంకటరమణ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. గ్రీవెన్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.


