News October 29, 2025
PDPL: భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

భూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్షలో భూ భారతి, సాధా బైనామా, మీ సేవా దరఖాస్తులపై వేగవంతమైన పరిష్కారం కోరారు. ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేయాలని, ఎస్‌ఐఆర్ పనులు శనివారానికి పూర్తిచేయాలని సూచించారు. బైపాస్ రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి భూసేకరణ పనులు త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.
Similar News
News October 30, 2025
బంధాలకు మిడ్‌లైఫ్ క్రైసిస్ ముప్పు

నలభైఏళ్లు దాటిన తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News October 30, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అమరావతి పరిధిలోని భూమిలేని నిరుపేదలకు పెన్షన్ల కోసం ప్రభుత్వం ₹71.09Cr విడుదల చేసింది.
* CRDA తీసుకున్న రుణాలపై వాయిదా చెల్లింపులకు ప్రభుత్వం ₹287Cr కేటాయించింది.
* అమరావతిలోని నెక్కల్లులో యువతకు నైపుణ్య శిక్షణకు L&T సంస్థ ₹369Crతో ఓ కేంద్రాన్ని నిర్మించనుంది. దీనికి సంస్థ ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.
* అసంపూర్తిగా ఉన్న బీసీ హాస్టళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ₹60Cr మంజూరు చేసింది.
News October 30, 2025
GNT: రంగస్థల కళాకారుడి నుంచి దర్శకుడు దాకా

ప్రముఖ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్ రావు (అక్టోబర్ 30, 1944-జనవరి 28, 2014) గుంటూరులో జన్మించారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు, తదితరులతో కలిసి నాటకాలలో నటించారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు.


