News October 4, 2025
PDPL: ముగిసిన పండుగలు.. కళ తప్పిన వేదికలు

గత నెలరోజులకు పైగా గణేష్, బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలతో సందడిగా మారిన పల్లెలు, పట్టణాల్లో వేడుకలు జరిగిన ప్రదేశాలు నేడు కళ తప్పి బోసిపోయి కనిపిస్తున్నాయి. గణపతి మండపాలను నిర్మించే సమయం నుంచి మొన్న ముగిసిన దసరా ఉత్సవాల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరు పండుగలను ఘనంగా నిర్వహించడానికి సహకరించారు. భజన కీర్తనలు, DJ సౌండ్ బాక్సుల మోతలతో ఆడిపాడిన ఉత్సవాల వేదికలు తీపి జ్ఞాపకాలను మిగిల్చాయి.
Similar News
News October 4, 2025
దేశం మోదీ చేతుల్లో సురక్షితం: బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు

పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈరోజు మాట్లాడారు. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలతో దేశం శత్రుదేశాలకు తలవంచని శక్తిగా మారిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామని, కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, బీజేపీ జెండా జిల్లాలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News October 4, 2025
ములుగు: ఎంపీటీసీనా.. లైట్ తీసుకో..!

మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు ఆశించిన స్పందన కనిపించట్లేదని అంటున్నారు గ్రౌండ్ రియాలిటీ గమనించిన పొలిటికల్ అనలిస్ట్‌లు. గడిచిన పదేళ్లలో ఎంపీపీలు, ఎంపీటీసీల పవర్ తగ్గుతూ వచ్చింది. విధులు, నిధులు లేకపోవడంతో మండల పరిషత్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ‘ఎన్నికల ఖర్చు తప్ప విలువలేని పదవి’ అంటూ చాలామంది మదనపడ్డారు. దీంతో ఈసారి పోటీకి ఎవరూ ఆసక్తి చూపట్లేదు. ములుగు జిల్లాలో 69 స్థానాలు ఉన్నాయి.
News October 4, 2025
గోదావరిఖని: కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి INTUC జాతీయ అధ్యక్షుడు Dr.సంజీవ రెడ్డితో కలిసి రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ శనివారం HYDలో కలిశారు. బొగ్గు గని కార్మికుల సంక్షేమం, JBCCIకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. JBCCIలో ఉన్న అన్ని కమిటీల్లో INTUC ప్రతినిధులను చేర్చాలని, దీంతో బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించారని చెప్పారు.