News March 17, 2025

PDPL: రాజీవ్ యువ వికాసం.. యువతలో ఆశలు..!

image

‘రాజీవ్ యువ వికాసం’తో ఉమ్మడి KNR జిల్లాలోని యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనున్నారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారికి రూ.3 లక్షలలోపు విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in సైట్‌ను వీక్షించవచ్చు. SHARE IT.

Similar News

News January 1, 2026

అల్లూరి: డీఈవోకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఉపాధ్యాయులు

image

మన్యం జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ గురువారం సాలూరు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బాలికొన్నత పాఠశాలలో సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ..ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాక్షించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్, సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఎంఈఓలకు, ఉపాధ్యాయ బృందాలు అభినందనలు తెలిపారు.

News January 1, 2026

రూ.3వేల కోట్ల విడుదలపై కేంద్రం షరతులు

image

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.

News January 1, 2026

KNR: సహకార శాఖ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

image

నూతన సంవత్సరం సందర్భంగా సహకార శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్‌ను జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.