News April 16, 2025
PDPL: ‘రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం సరఫరా అనే ప్రచారం అవాస్తవం’

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్నబియ్యంలో ప్లాస్టిక్ బిల్డింగ్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేసి, సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్దేశంతో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే ఐటీయాక్ట్ సెక్షన్ 67 డి, BNS సెక్షన్ 353, 352 కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News July 9, 2025
రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్‌లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.