News February 23, 2026

PDPL: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి

image

PDPL(D) మంథని(M) శాస్త్రులపల్లి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల, అనారోగ్యం, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పోలీసులకు సరెండర్ అయ్యారు. 2007 కేరళ జిల్లాలో SIB పోలీసులు అరెస్టు చేయగా, 2009లో బెయిల్‌పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

Similar News

News February 28, 2026

HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

image

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!

News February 28, 2026

కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.

News February 28, 2026

MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.