News October 14, 2025
PDPL: లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్..!

PDPL పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సోను మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. MHలోని గడిచిరోలిలో 60మందితో కలిసి సరెండరయ్యారు. ఇక మల్లోజులపై రూ.కోటి రివార్డుంది. అయితే తాను లొంగిపోయేది లేదని గతంలో తల్లి మధురమ్మకు వేణుగోపాల్ లేఖ రాశారు. కాగా వేణుగోపాల్ సోదరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు బెంగాల్‌లో గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు.
Similar News
News October 14, 2025
పాలమూరు యూనివర్శిటీ.. స్నాతకోత్సవాల UPDATE

పాలమూరు వర్శిటీలో మొట్ట మొదటి స్నాతకోత్సవం NOV 20న, 2014లో జరిగింది. 56 బంగారు పతకాలు, 7636 డిగ్రీలు(UG & PG) ప్రదానం చేశారు.
✒2వ స్నాతకోత్సవం మార్చి 6న, 2019లో జరిగింది. మొత్తం 14,675 డిగ్రీలు(UG&PG), 115 బంగారు పతకాలు ప్రదానం చేశారు.
✒3వ స్నాతకోత్సవం NOV 24న, 2022లో జరిగింది. మొత్తం 6 PhD. (కెమిస్ట్రీ-3, ఇంగ్లీష్-2, మైక్రోబయాలజీ-1), 33,577 డిగ్రీలు (UG & PG), 71 బంగారు పతకాలు ప్రదానం చేశారు.
News October 14, 2025
ఈ నెల 16న పాలమూరు వర్సిటీ స్నాతకోత్సవం

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఈ నెల 16న ‘4వ స్నాతకోత్సవం’ నిర్వహించనున్నట్లు ఉపకులపతి (వీసీ) ఆచార్య డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 83 బంగారు పతకాలు, 2,809 పీజీ, 8,291 ప్రొఫెషనల్, 18,666 యూజీ డిగ్రీలు, 12 పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నట్లు వీసీ వెల్లడించారు.
News October 14, 2025
MBNR: తుమ్మల క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మానవత్వం ఉందా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతోనే తుమ్మల మంత్రి అయ్యారన్నారు. మాగంటి సునీత ఎమ్మెల్యే భర్త మరణిస్తే వచ్చిన ఉపఎన్నికలో ఆమె బిడ్డలు, కొడుకు ప్రచారం చేయడంపై అభ్యంతరం ఏంటని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.