News April 3, 2025
PDPL: విద్యాశాఖ కార్యదర్శితో వీసీలో పాల్గొన్న కలెక్టర్

ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
Similar News
News April 3, 2025
మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర ఇలా

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
News April 3, 2025
టీడీపీదే కబ్జాల బతుకు: వైసీపీ

AP: వక్ఫ్ భూములను కబ్జా చేసి HYD సాక్షి ఆఫీసును జగన్ నిర్మించారంటూ TDP చేసిన ఆరోపణలపై YCP ఫైరయ్యింది. ‘మీ బతుకే కబ్జాల బతుకు. NTR పార్టీని, సైకిల్ గుర్తును, బ్యాంకు ఖాతాలను లాక్కున్నారు. HYDలో NTR ట్రస్ట్ భవన్‌కు GOVT స్థలాన్ని, మంగళగిరిలో పార్టీ ఆఫీస్‌కు వాగు పోరంబోకు భూమిని కబ్జా చేశారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి, ముస్లింలకు వెన్నుపోటు పొడిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మండిపడింది.
News April 3, 2025
మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించిన హరీశ్ రావు

కడ్తాల్ మండలం చరికొండ పంచాయతీలోని బోయిన్‌గుట్ట తండాలో నూతనంగా ఏర్పాటుచేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.