News January 8, 2026

PDPL: విశ్వబ్రాహ్మణుల సమస్యలపై సీఎం దృష్టికి వినతి

image

పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి అక్రమ రికవరీలు, బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారుల ఉపాధి సమస్యలను వివరించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ లభించింది.

Similar News

News January 28, 2026

అజిత్ దాదా.. బారామతి రాజకీయ మాంత్రికుడు

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావ్ పవార్‌ను ఆయన అభిమానులంతా ‘అజిత్ దాదా’గా పిలుచుకునేవారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో NCPలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా 6 సార్లు Dy.CMగా చేశారు. పొలిటికల్ “సర్వైవర్” గానూ అజిత్ ప్రసిద్ధి. కీలకమైన సమస్యలను సైతం పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసేవారు. పవార్ తల్లిదండ్రులు అనంతరావు పవార్, అశాతై పవార్.

News January 28, 2026

HYD నుంచి 900 స్పెషల్ బస్సులు

image

నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 900 బస్సులను నడుపుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులూ రంగంలోకి దిగి ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News January 28, 2026

147పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

<>సొసైటీ <<>>ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ &రీసెర్చ్(SAMEER)లో 147 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 25 ఆఖరు తేదీ కాగా.. ఇవాళ్టి వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MSc, BSc, డిప్లొమా, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష FEB 1న నిర్వహించనున్నారు. సైట్: https://sameer.gov.in/