News November 12, 2025
PDPL: శతాబ్ది ఉత్సవాలకు విజయవంతం చేయాలి: సీపీఐ

కార్మిక, కర్షకుల, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీపీఐ అని జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఖమ్మంలో జరిగే శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న మహాసభకు పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News November 13, 2025
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
News November 13, 2025
టుడే..

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
News November 13, 2025
పాల వ్యాపారం.. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం

పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్. ఆమె 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, బర్రెలున్నాయి. మెషిన్లతో పాలను తీస్తూ రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలను అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీ క్లిక్ చేయండి.


