News March 28, 2026
PDPL: సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

PDPL కలెక్టరేట్‌లో హాస్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు. భోజనం, స్టడీ అవర్స్ సమయంలో వార్డెన్లు తప్పనిసరిగా హాజరై ఉండాలని, హాస్టళ్లలోనే నివసించాలని స్పష్టం చేశారు. కేటాయించిన బడ్జెట్‌ను నెలాఖరు లోపు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల చదువుకు అనుకూలంగా స్టడీ అవర్స్ నిరంతరం నిర్వహించాలని తెలిపారు.
Similar News
News April 5, 2026
రాజంపేట: జాతర ఎప్పుడో తెలియదు.. జెయింట్ వీల్ వచ్చేసింది

రాజంపేటలో ప్రసిద్ధి చెందిన బలిజపల్లి గంగమ్మ జాతర ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఈరోజు, ఆరోజు అంటూ పుకార్లు షికార్లు చేస్తుండడంతో భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే జాతర నిర్వహణ బాధ్యతఉంది. అందువల్ల ప్రతి ఏడాది ఇదే తంతు నడుస్తోంది. జాతర ఉంటుందని నమ్మి ఈ ఆదివారం వ్యాపారులు జెయింట్ వీల్ తీసుకొచ్చారు.
News April 5, 2026
శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
News April 5, 2026
చెన్నూరు ఇటుక బట్టీలపై అధికారుల కొరడా

చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు.


