News May 19, 2024
PDPL: స్ట్రాంగ్‌రూంలను తనిఖీ చేసిన స్టేట్ డిప్యూటీ ఎన్నికల ప్రధానాధికారి
ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్‌లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.
Similar News
News December 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ధర్మపురిలో భర్తపై జీడి రసంతో దాడి చేసిన భార్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి. @ మెట్పల్లి పట్టణంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ. @ సిరిసిల్ల జిల్లాలో లారీ, కారు ఢీ.. ఒకరి మృతి. @ గొల్లపల్లి మండలంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య. @ కరీంనగర్లో సైబర్ మోసం.
News December 26, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్
☞సిరిసిల్ల: లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ☞ఎల్లారెడ్డిపేట: గుండారంలో విద్యుత్ ఘాతంతో మహిళ మృతి ☞ఎండపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ☞చొప్పదండి: తాగి పోలీస్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదు ☞ గొల్లపల్లి: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య ☞ గంభీరావుపేట: పేకాట రాయుళ్ల అరెస్టు ☞మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు.
News December 26, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నేటి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 2,65,369 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,60, 265, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 74,515 , అన్నదానం రూ.30,589 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.