News September 22, 2025
PDPL: హార్వెస్టర్ యజమానులతో రేపు కీలక సమావేశం

పెదపల్లి జిల్లాలోని అన్ని వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు, హార్వెస్టర్ యజమానులకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హార్వెస్టర్ యజమానుల పాత్ర, విధులు, నియమనిబంధనలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి యాజమాన్యాలు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
Similar News
News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.
News September 22, 2025
వరంగల్: బతుకమ్మను బతకనివ్వండి..!

బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామని లాస్యప్రియ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున HNK నయీం నగర్ ప్రాంతానికి చెందిన లాస్య సాయి ప్రకాశ్ ఆడ పిల్లల్ని కడుపులో ఉండగానే చంపుతున్నరాని, అలా చంపడం నేరమని., వాటిని నిర్మూలించాలని కోరుతూ ప్లే కార్డ్ పట్టుకొని బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామనే సందేశాన్ని అందించారు. వినూత్నంగా ఆలోచానను అందరు అభినందించారు.
News September 22, 2025
బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.