News August 24, 2025
PDPL: 26న విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆగస్టు 26న విదేశాల్లో ఉపాధి అవకాశాలపై టామ్‌కామ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరుగుతుందని జిల్లా పరిశ్రమల అధికారి ఏ.కీర్తికాంత్ తెలిపారు. జపాన్, జర్మనీ, ఇజ్రాయెల్, ఫిజీ, గ్రీస్, పోర్చుగల్, యుఏఈ తదితర దేశాల్లో వివిధ ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆసక్తిగల నిరుద్యోగులు హాజరై నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News August 24, 2025
సీఎం సారూ.. ఇవిగో OU సమస్యలు..!

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించనుడంతో వర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రొఫెసర్లను నియమించాలి. ఉర్దూ శాఖలో ఉన్నది కేవలం నలుగురు అధ్యాపకులు మాత్రమే. అలాగే ఫిలాసఫి, సైకాలజీకి ఇద్దరేసి అధ్యాపకులున్నారు. మొత్తంగా 1000 టీచింగ్, 2400 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News August 24, 2025
సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది: జిల్లా SP

ప్రతిరోజు సైక్లింగ్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతోపాటు, పోలీస్ అధికారులు, సిబ్బంది సైకిల్ తొక్కి వ్యాయామ సాధన చేశారు. అనంతరం ఎస్పీ పలు సూచనలు చేశారు.
News August 24, 2025
మంథని నుంచి శ్రీశైలంకు ప్రత్యేక బస్సు

మంథని బస్టాండ్ నుంచి ఈ నెల 31న శ్రీశైలానికి ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజ్ సర్వీసును ప్రారంభించనున్నట్లు DM శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ బస్సు మంథని బస్టాండ్ నుంచి బయలుదేరి శ్రీశైలం దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో అహోబిలం దర్శనం చేసుకుని మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మంథనికి చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,800 ఛార్జీ. వివరాల కోసం 9959225923, 9948671514 నంబర్లను సంప్రదించవచ్చు.