News September 6, 2025
PDPL: 9వ సారి లడ్డూ దక్కించుకున్న యువకుడు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్‌లో నెలకొల్పిన మహాగణపతి లడ్డూను చింతపండు సాయి చరణ్, ప్రమోదిని దంపతులు వేలం ద్వారా రూ.75 వేలకు దక్కించుకున్నారు. అయితే ఆ లంబోదరుడి మహాప్రసాదాన్ని సాయి చరణ్ వరుసగా తొమ్మిదోసారి దక్కించుకోవడం విశేషం. ఇందుకు ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మండపంలోని ప్రధాన కలశాన్ని రూ.25వేలకు సిగిరి లచ్చయ్య దక్కించుకున్నారు.
Similar News
News September 6, 2025
బాపట్ల జిల్లాలో 90 వేల హెక్టార్లలో వరి సాగు

గత ఏడాది జిల్లాలో 88 వేల హెక్టార్లలో వరి పంటలు సాగు చేయగా, ప్రస్తుతం 90 వేల హెక్టార్లకు వరి సాగు జరిగిందని కలెక్టర్ మురళి శనివారం తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 2.24 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు ప్రారంభించినట్లు తెలిపారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని 20వేల టన్నుల యూరియా కావాలని అంచనా వేశామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 21,609 టన్నుల యూరియా జిల్లాకు విడుదల అయిందన్నారు.
News September 6, 2025
ప్రకాశం: 13 మందికి కారుణ్య నియామక పత్రాల పంపిణీ

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. కారుణ్య నియామక కోటాలో ఉద్యోగం పొందిన 13 మందికి శనివారం ఒంగోలులో ఆమె నియామక పత్రాలను ఇచ్చారు. ఆడిట్, రెవెన్యూ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్, కార్మిక శాఖల్లో వీరికి ఉద్యోగాలు కల్పించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానానికి చేరుకునేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
News September 6, 2025
SPMVV: మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా పద్మావతి మహిళా యూనివర్సిటీ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ సెప్టెంబర్ 15.