News December 11, 2025

PDPL: AICC జాతీయ అధ్యక్షుడిని కలిసిన ప్రముఖులు

image

AICCజాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, CM రేవంత్ రెడ్డిని మంత్రి వివేక్, పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ గురువారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన సూచించారు. తెలంగాణను దేశంలో ఒక మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఖర్గే మార్గదర్శకం చేశారు.

Similar News

News December 14, 2025

@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 18.82%
★ హనుమకొండ: 19.57%
★ ములుగు: 18.85%
★ భూపాలపల్లి: 26 40%
★ జనగాం: 16.82%
★ మహబూబాబాద్: 23.30%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్

image

మంచిర్యాల జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.52% ఓటింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో 22.81శాతం, భీమిని 21.39, కన్నెపల్లి 23.33 శాతం, కాసీపేట్ 19.45, నెన్నెల్ 18.46, తాండూర్ 22.07, వేమనపల్లి 24.22 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
*జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

News December 14, 2025

ISIS దాడిలో ముగ్గురు అమెరికన్ల మృతి.. ట్రంప్ వార్నింగ్

image

సెంట్రల్ సిరియాలో ఐసిస్ చేసిన దాడిలో ముగ్గురు అమెరికన్లు చనిపోయారు. వీరిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు ఉన్నారు. ఈ ఘటనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అమెరికా, సిరియాపై జరిగిన దాడి అని, బలమైన ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైనట్లు సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.