News April 3, 2025

PDPL: విద్యాశాఖ కార్యదర్శితో వీసీలో పాల్గొన్న కలెక్టర్

image

ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

Similar News

News April 4, 2025

మహబూబాబాద్‌లో ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’

image

మహబూబాబాద్ జిల్లాలోని DFO ఆఫీసులో “అమ్మ పేరు మీద ఒక చెట్టు” పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలపై అమ్మపై చూపించే చూపించాలని పేర్కొన్నారు.

News April 4, 2025

రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి

image

AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రెడ్‌బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని సంధ్యారాణి అన్నారు.

News April 4, 2025

కూర్మన్నపాలెంలో 100 కేజీల గంజాయి పట్టివేత

image

గాజువాక సమీపంలో గల కూర్మన్నపాలెం వద్ద అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ తరలించేందుకు 44 బ్యాగుల్లో సిద్ధంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ చెందిన నలుగురు ముఠా పరారు కాగా.. భగత్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి 100 కేజీల వరకు పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!