News April 29, 2024
PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటరెడ్డి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర అధ్యక్షుడుగా వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు PDSU జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను నియమించారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్ట పరచాలని నూతన అధ్యక్షుడు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News November 22, 2025
వరంగల్లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్కు బదిలీ అయ్యారు.

ఉమ్మడి వరంగల్ DCC అధ్యక్షులు వీరే..!

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్త డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది.
హనుమకొండ DCCగా ఇనుగాల వెంకటరామిరెడ్డి,
వరంగల్ DCCగా మహమ్మద్ అయుబ్,
ములుగు DCCగా పైడాకుల అశోక్,
జనగామ DCCగా లకావత్ ధనవంతి,
భూపాలపల్లి DCCగా బట్టు కరుణాకర్,
మహబూబాబాద్ DCCగా భూక్య ఉమాను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.