News February 6, 2025
పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.
Similar News
News November 21, 2025
విగ్రహాలను పూజించడం వెనుక సైన్స్

హిందూ మతంలో విగ్రహారాధనను ఎక్కువ ప్రోత్సహిస్తాం. అనేక దేవుళ్లు శిలలా మారడంతో విగ్రహాలే దైవాలని మనం వాటికి పూజలు చేస్తుంటాం. దేవుడు అందులో నుంచే మన మొరను వింటాడని అనుకుంటాం. అయితే ఈ విగ్రహారాధన ఆధ్యాత్మికంగా మనకు ఓ స్పెషల్ ఫోకస్ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రార్థన సమయంలో విగ్రహాన్ని చూస్తే.. మన ఆలోచనలు ఆయన రూపంతో అనుసంధానమైన మనల్ని భక్తి పథంలో నడిపిస్తాయని ఓ పరిశోధనలో తేల్చారు.
News November 21, 2025
AIIMS గువాహటిలో 177 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిమ్స్ గువాహటి 177 Sr. రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ (MD/MS/DNB), MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWSలకు రూ.500. వెబ్సైట్: https://aiimsguwahati.ac.in.
News November 21, 2025
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

HYDలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపుతూ ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. అన్నపూర్ణ సంస్థ ₹11.52L చెల్లించాల్సి ఉండగా కేవలం ₹49K చెల్లిస్తోందని, రామానాయుడు సంస్థ ₹2.73Lకి గాను ₹7,614 కడుతున్నట్లు సమాచారం.


