News November 8, 2024

శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేస్తాం: బైడెన్

image

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కు బాధ్యతల్ని శాంతియుతంగా, సక్రమ పద్ధతిలో బదిలీ చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ట్రంప్‌తో నిన్న మాట్లాడాను. విజయంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. బాధ్యతల బదలాయింపును అత్యంత సక్రమంగా జరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశిస్తానని ఆయనకు హామీ ఇచ్చాను. ఓడినప్పటికీ, ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కమలా హారిస్ గర్వించాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News November 8, 2024

గీజర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!

image

చాలామంది గీజర్‌ను గంటల తరబడి ఆన్‌లోనే ఉంచుతారు. అది ఏమాత్రం మంచిదికాదు. ఒక్కోసారి గీజర్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్‌ను ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఏమైనా లీకేజీ ఉంటే తెలుస్తుంది. గీజర్ కనెక్షన్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా ఏళ్లుగా వాడుతున్న పరికరాలను మార్చడం ఉత్తమం. వాటి వల్ల షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 8, 2024

రోహిత్‌శర్మ నుంచి అది నేర్చుకున్నా: సూర్య

image

ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన మన మనస్తత్వం మార్చుకోవద్దని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని రోహిత్‌శర్మను చూసే నేర్చుకున్నానని సూర్య చెప్పారు. రోహిత్ గ్రౌండ్‌లో ఎలా ఉంటారో తాను గమనిస్తూ ఉంటానన్నారు. అందరూ హార్డ్‌వర్క్ చేస్తారని, కొన్నిసార్లు కలిసొస్తే, కొన్నిసార్లు వర్కవుట్ కాదని సూర్య చెప్పుకొచ్చారు. రేపు సౌతాఫ్రికాతో T20 సిరీస్ ప్రారంభం కానుంది.

News November 8, 2024

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

* 1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
* 2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
* 1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
* 1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు
* 1969: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు
* 1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
* 2013: కమెడియన్ ఏవీఎస్ మరణం