News June 27, 2024
కౌలు రైతులకూ రైతు భరోసా!

TG: కౌలు రైతులకూ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో వారు 25 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోనున్నారు. దీంతో వీరిని ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
Similar News
News December 8, 2025
చౌటుప్పల్ సమీపంలో భారీగా మద్యం పట్టివేత

చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News December 8, 2025
సమ్మిట్ గెస్టుల కోసం తెలంగాణ చిరుతిళ్లు

TG: ఈరోజు, రేపు జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం తెలంగాణ స్పెషల్ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను వారికి అందజేయనున్నారు. అందులో సకినాలు, నువ్వుల లడ్డూ, గారెలు, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు ఉన్నాయి. ఇక లంచ్‌లో హైదరాబాద్ దమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీ, విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాల వంటలను రెడీ చేస్తున్నారు.
News December 8, 2025
వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.


