News February 16, 2025

నేటి నుంచి పెద్దగట్టు జాతర

image

TG: సూర్యాపేట జిల్లాలోని శ్రీలింగమంతులు స్వామి(పెద్దగట్టు) జాతర నేటి నుంచి ఈ నెల 20 వరకూ జరగనుంది. ఈ 4రోజుల పాటు అత్యంత ఘనంగా వేడుక జరపనున్నామని, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేశామని పేర్కొన్నారు. 15లక్షలమందికి పైగా భక్తులు జాతరకు రావొచ్చని అంచనా. రాష్ట్రంలో అతి పెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో పెద్దగట్టు జాతర జరుగుతుంటుంది.

Similar News

News November 12, 2025

‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

image

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.

News November 12, 2025

18 రోజులు.. ఈసారి మహాభారతమే

image

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.

News November 12, 2025

పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

image

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.