News May 7, 2025
పెద్దిరెడ్డి కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది: రాంప్రసాద్ రెడ్డి

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ భూములకు సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ‘రాయలసీమలో ఆయన కుటుంబం ముఠామేస్త్రిలా వ్యవహరిస్తోంది. మదనపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీయొచ్చు. మాధవరెడ్డి అరెస్టుతో ఆ కేసు కొలిక్కి వచ్చింది. ఆలస్యమైనా తప్పులు చేసిన వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జగన్‌కు రాజ్ కసిరెడ్డి అత్యంత సన్నిహితుడు’ అని మంత్రి అన్నారు.
Similar News
News August 10, 2025
ఈసీ ఆదేశాలు TDP బేఖాతరు చేస్తోందంటూ YCP విమర్శలు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ప్రచారం సా.5గంటలతో ముగిసింది. అయినా, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్ట వేశారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హరిత హోటల్ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి నేతలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
News August 10, 2025
అల్పపీడనం.. 4 రోజులు అతిభారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 13, 14, 15, 16వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News August 10, 2025
పులివెందుల వైపే రాష్ట్రం చూపు..

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల బరిలో 11 మంది చొప్పున బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, YCP అభ్యర్థుల మధ్యే ఉంది. పులివెందులలో హేమంత్ రెడ్డి(వైసీపీ), మారెడ్డి లతారెడ్డి(TDP) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఒంటిమిట్టలో సుబ్బారెడ్డి(YCP), ముద్దు కృష్ణ రెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు. అటు వైసీపీ చీఫ్ జగన్ పులివెందుల MLA కావడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.