News March 16, 2024
పదో సారి MLAగా పెద్దిరెడ్డి పోటీ
వైసీపీ పుంగనూరు MLA అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఖరారు చేశారు. 1989, 99, 2004లో పీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 14, 19లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1978లో జనతా పార్టీ, 1985, 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీలేరులో పోటీ చేయగా ఓడిపోయారు. తాజాగా పదోసారి ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నారు.
Similar News
News November 24, 2024
IPL వేలానికి చిత్తూరు కుర్రాడు..!
మొట్టమొదటి సారిగా IPL వేలం పాటలోకి ఉ.చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు గిరీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లెకి చెందిన ఈయన SVUలో బీటెక్ పూర్తిచేశాడు. క్రికెట్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన IPL వేలంపాటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఇవాళ లేదా రేపు తెలియనుంది. ఏ టీం సెలక్ట్ చేసుకుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News November 24, 2024
వర్సిటీలో గంజాయి వినియోగం అవాస్తవం: రిజిస్ట్రార్
తిరుపతి సంస్కృత వర్సిటీలో పలువురు విద్యార్థులు గంజాయి వినియోగిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై వర్సిటీ రిజిస్ట్రార్ రమాశ్రీ స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో ఏ మాత్రం నిజాలు లేవన్నారు. పలువురు విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడంతో హాస్టల్ గదులను తనిఖీ చేశామన్నారు. అనుమానంతో పలువురుని టెస్టింగ్ కోసం రుయాకు తరలించినట్లు తెలిపారు. యాంటీ డ్రగ్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
News November 24, 2024
చిత్తూరు:అసెస్మెంట్ కార్డులను అందించాలి
పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.