News June 4, 2024

PEDDIREDDY: ఒకే ఒక్కడు!

image

AP: ఎన్డీయే కూటమి గాలిలో వైసీపీ మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం గెలుపొందారు. పుంగనూరు నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు. కాగా పుంగనూరులో పెద్దిరెడ్డి బలమైన కేడర్ ఉండటం వల్ల ఇంత గాలిలోనూ ఆయన గెలిచి నిలిచారు. తన సహచర మంత్రులందరూ ఓటమి ఎదుర్కొన్నా తాను మాత్రం విజయం సాధించారు.

Similar News

News November 17, 2025

OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

image

AP: ఈ నెల 19న పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.

News November 17, 2025

21న ఓటీటీలోకి ‘బైసన్’

image

* చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.
* హాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన F1 మూవీ DEC 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బ్రాడ్ పిట్ లీడ్ రోల్ పోషించారు.

News November 17, 2025

షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాను ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్(ICT) దోషిగా తేల్చింది. గతేడాది విద్యార్థుల ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారని, 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని విచారించిన ICT ఆధారాలను నిజమైనవిగా పరిగణించి దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్ఠశిక్ష పడుతుందని పేర్కొంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తీర్పును పట్టించుకోనని హసీనా అన్నారు.