News March 20, 2024

ఆ వ్యాఖ్యలను పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

image

AP: చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాఫియాలతో పొత్తులేకుండా పెద్దిరెడ్డి ఎన్నికల్లో నిలబడాలన్నారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. టీడీపీ పొత్తులు బహిరంగమేనని.. జగన్‌వి చీకటి పొత్తులని విమర్శించారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.

Similar News

News December 8, 2025

శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

image

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక. <<-se>>#AyyappaMala<<>>

News December 8, 2025

షూటింగ్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన సురుచి

image

ఖతార్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ సురుచీ సింగ్ స్వర్ణం సాధించారు. విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్‌‌‌‌ చేసి జూనియర్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. హర్యానాకు చెందిన సురుచి ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచారు.

News December 8, 2025

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

image

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.