News June 11, 2024

ఆదాయపన్ను చట్టంలో చిన్న తప్పులకు తగ్గనున్న శిక్ష?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చిరు తప్పిదాలకు శిక్షలను తగ్గించాలని కేంద్రం భావిస్తోందట. ఉదాహరణకు ప్రస్తుతం టీడీఎస్ చెల్లింపు ఆలస్యమైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో సంస్థల యాజమాన్యాలు సైతం చిక్కుల్లో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చిరు తప్పిదాలకు శిక్షను జరిమానాకు పరిమితం చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందట.

Similar News

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.