News April 28, 2024

ఇషాన్ కిషన్‌కు జరిమానా

image

ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు BCCI జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనకు ఫైన్ విధించింది. కాగా ఈ సీజన్‌లో ఇషాన్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 212 రన్స్ చేశారు. అతడి బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు.

Similar News

News January 29, 2026

ఈ 4 పండ్లు తింటే టైప్-2 డయాబెటిస్ ముప్పు

image

సపోటాల్లోని విటమిన్ A, C, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రక్టోజ్, సుక్రోజ్ రక్తంలో షుగర్ లెవెల్స్‌‌ను పెంచుతాయి. అరటిపండులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉన్నందున వారానికి 2-3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. మామిడి పండ్లు, సీతాఫలం తిన్నా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉండడంతో రెగ్యులర్గా తినకూడదు. షుగర్ కంట్రోల్‌లో లేనివారు/ఇన్సులిన్ వాడతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

News January 29, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 29, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 29, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.25 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.