News August 30, 2024

పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

image

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.

Similar News

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

image

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం

News February 11, 2026

అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.