News March 22, 2024
టీడీపీలో పెండింగ్ స్థానాలివే

AP: మొత్తం 3 విడతల్లో అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన TDP.. 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో పెట్టింది. విజయనగరం సీటు తీసుకుని బీజేపీకి రాజంపేట స్థానం కేటాయించడంపై చర్చలు నడుస్తుండగా.. కడప విషయంలో శ్రీనివాసులురెడ్డి/వీరశివారెడ్డి, ఒంగోలులో మాగుంట కుటుంబంలో పోటీపై చర్చ, అనంతపురంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఇక ఎచ్చెర్ల, భీమిలి, చీపురుపల్లి సహా మరో 2 అసెంబ్లీ స్థానాలపై బీజేపీతో స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
BREAKING.. హైకోర్టు సీరియస్.. పెద్దంపేట GP ఎన్నిక నిలిపివేత

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్ను ఓటర్ లిస్టులో పేరు లేదని ఈసీ తిరస్కరించింది. ఆన్లైన్ ఓటర్ లిస్టులో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశించినా అధికారులు వినకపోవడంతో ఎన్నికను నిలిపివేసింది.
News December 7, 2025
తల్లయిన హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ను వివాహం చేసుకున్నారు.
News December 7, 2025
తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారని చెప్పారు.


