News January 4, 2025
సోమవారం నుంచి పెన్షన్ల తనిఖీలు
AP: అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి. నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు. పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్‌లో పెడతారు.
Similar News
News January 6, 2025
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కు ఆటంకం?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తమిళనాడులోని ‘లైకా ప్రొడక్షన్స్’ షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్-3’ని పూర్తి చేయకుండా దిల్ రాజు తన ‘గేమ్ ఛేంజర్’ను TNలో విడుదల చేయొద్దని సూచించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాత ఇండియన్-3 మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తామని శంకర్ లైకాకు తెలిపారని టాక్. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
News January 6, 2025
No Hikes: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్!
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాకిచ్చింది. వేతనాల పెంపును FY25 నాలుగో త్రైమాసికానికి వాయిదా వేసినట్టు తెలిసింది. అంటే ఏప్రిల్ వరకు పెంపు ఉండనట్టే. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో హైక్ ఇవ్వడం గమనార్హం. సాధారణంగా ఇన్ఫీ 2025 ఆరంభంలోనే హైక్‌ను ప్రకటించాల్సింది. ప్రాఫిటబిలిటీ కోసం HCL TECH, LTI MINDTREE, L&T వేతనాల పెంపును వాయిదా వేయడంతో ఆ బాటలోనే నడిచింది. పర్ఫామెన్స్ బోనస్ మాత్రం సగటున 90% వరకు ఇచ్చింది.
News January 6, 2025
గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు: దేశంలో ఎన్నంటే?
గుజరాత్‌లో తొలి HMPV వైరస్ కేసు నమోదైనట్టు సమాచారం. అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పేషంట్ చేరినట్టు ABP అస్మిత న్యూస్ తెలిపింది. ఆ చిన్నారి వయసు రెండేళ్లని పేర్కొంది. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్టైంది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు HMPV సోకినట్టు ICMR ఉదయం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.