News December 30, 2024

రేపే పింఛన్ల పంపిణీ.. పల్నాడుకు CM

image

AP: సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10.50 గంటలకు ఆ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News October 19, 2025

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్‌కు అంగీకరించినట్లు ఖతర్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఈ చర్యలు రాబోయే రోజుల్లో పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. కాగా ఈ చర్చలకు ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయి.

News October 19, 2025

ఆరోగ్యం కోసం ‘ధన్వంతరీ మంత్రం’

image

న‌మామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం స‌క‌ల‌ ఔషధీనాం
ఈ మంత్రం ధన్వంతరి స్వామివారిని కీర్తిస్తుంది. ఆయన జయంతి రోజున ఈ మంత్రాన్ని చదవడం వల్ల సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర దినాన మందులు దానం చేయడం, నిస్సహాయులకు ఔషధాలను అందించడం వల్ల దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెబుతారు.

News October 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్‌లాండ్ ప్లేయర్ అన్యాపత్‌తో అమీతుమీ