News January 5, 2025

దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లలోనే పింఛన్: మంత్రి డోలా

image

AP: దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

పుత్తడి పరుగులు.. పెళ్లి చేసేదెలా?

image

ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం తప్పనిసరి కావడంతో, ఈ పెరుగుదల సామాన్య కుటుంబాలపై పెను భారంగా మారింది. పసిడి పరుగులు ఇలాగే కొనసాగితే పెళ్లిళ్ల సమయానికి 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షలకు చేరుతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 24క్యారెట్ల 10gల బంగారం ధర రూ.1.52లక్షలుగా ఉంది.

News January 20, 2026

INTER EXAMS: 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

image

TG: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

News January 20, 2026

సరిహద్దుల్లో ఉగ్ర బంకర్లు.. మ్యాగీ, బియ్యం..

image

J&Kలోని కిష్త్వార్‌లో జైషే మహ్మద్(JeM) టెర్రరిస్టుల భారీ బంకర్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. వాళ్లు నెలల తరబడి అక్కడ షెల్టర్ తీసుకున్నారని గుర్తించాయి. 50 మ్యాగీ ప్యాకెట్లు, తాజా కూరగాయలు, 15 రకాల దినుసులు, 20KGs బాస్మతి బియ్యం, గ్యాస్ స్వాధీనం చేసుకున్నాయి. జైషే కమాండర్ సైఫుల్లా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాయి. బంకర్‌ను తాము గుర్తించడంతో టెర్రరిస్టులు గ్రనేడ్లు విసిరి <<18892238>>పారిపోయినట్లు<<>> తెలిపాయి.