News March 24, 2025
ఇకపై వారి అకౌంట్లలోనే పింఛన్ జమ

AP: సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 10వేల మంది దివ్యాంగ స్టూడెంట్స్కి ఉపశమనం కలగనుంది.
Similar News
News January 9, 2026
కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.
News January 9, 2026
TET: ఇన్-సర్వీస్ టీచర్లలో 47.82% పాస్

AP: ఇన్-సర్వీస్ టీచర్లు రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలనే సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి రాష్ట్రంలో 31,886 మంది పరీక్షలు రాశారు. అందులో 47.82% మంది పాసైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2012లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు 2025 SEPలో తీర్పునిచ్చింది. ఈ టెట్లో ఫెయిలైన వారు మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంది. అందులోనూ ఫెయిలైతే ఉద్యోగాలు కోల్పోతారు.
News January 9, 2026
97% మందికి వైకుంఠ ద్వార దర్శనం: CM CBN

AP: తిరుమల పవిత్రతను కాపాడేేందుకు భక్తుల సహకారం అవసరమని CM CBN అన్నారు. వైకుంఠ ఏకాదశిని అద్భుతంగా నిర్వహించిన TTDని అభినందించారు. DEC 30-JAN 8 వరకు 7.83 లక్షల మందికి వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 97% మంది సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అభినందనీయమన్నారు. క్యూలైన్లు, ప్రసాదం పంపిణీ నుంచి అమలు చేసిన అన్ని విధానాలు సత్ఫలితాలనిచ్చాయన్నారు.


