News August 20, 2025

పెన్షన్లు.. వారికి మరో అవకాశం

image

AP: పెన్షన్‌కు <<17398848>>అనర్హులుగా<<>> నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తాము పెన్షన్‌కు అర్హులమని భావించే వారు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అర్హుల గుర్తింపులో అక్రమాలు జరిగాయని, నోటీసులు అందుకున్నవారు సదరం శిబిరాల్లో మరోసారి వైకల్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Similar News

News August 20, 2025

రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ MP శశిథరూర్ మద్దతు

image

నేరం చేస్తే పీఎం, సీఎం, మంత్రులకు ఉద్వాసన పలికేలా కేంద్రం రూపొందించిన బిల్లుకు ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఆ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సీఎంలను అన్యాయంగా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు. అయితే అందుకు భిన్నంగా శశి థరూర్ స్పందిస్తూ ఆ బిల్లుల్లో లోపమేమీ లేదని అభిప్రాయపడ్డారు.

News August 20, 2025

నేనిప్పుడే రిటైర్ అవ్వను: నాగవంశీ

image

‘వార్-2’ సినిమాతో భారీ నష్టం వాటిల్లిందని, అందుకే సినిమాలు ఆపేసి నిర్మాత దుబాయ్‌కి వెళ్లిపోతున్నారంటూ వచ్చిన వార్తలను నాగవంశీ ఖండించారు. ఆ టైం ఇంకా రాలేదని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాను రిటైర్ అయ్యేందుకు ఇంకా 10-15 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఆల్ వేస్ ఫర్ సినిమాస్ అంటూ రాసుకొచ్చారు. తర్వాత సినిమా ‘మాస్ జాతర’తో మళ్లీ మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు.

News August 20, 2025

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే శిక్ష పడుతుందా?

image

లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ <<17461749>>గేమింగ్‌ బిల్లు<<>> పాసైతే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడే వారికి శిక్ష పడుతుందా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు, బాధితులకు ఈ బిల్లు వల్ల ఎలాంటి శిక్షలు పడవని తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఆర్గనైజర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వటైజర్స్, ప్రమోటర్స్, ఫైనాన్షియల్ సపోర్టర్స్‌కి మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుందని సమాచారం.