News April 2, 2024
పెన్షన్లు: ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలంటూ గుంటూరుకు చెందిన మహిళ హైకోర్టును కోరారు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.
Similar News
News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్‌ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
News November 13, 2025
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రష్మి అయ్యర్‌కు గోల్డ్ మెడల్

దక్షిణాఫ్రికాలోజరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో నాగ్‌పూర్‌కు చెందిన రష్మీఅయ్యర్ గోల్డ్ మెడల్ గెలిచి రికార్డు సృష్టించారు. ఇందులో 22 దేశాల నుండి 390 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాది కజకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన ఆమె వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించారు. గతేడాది స్పాన్సర్లు లేకపోవడంతో ఆమె తన బంగారం అమ్మి పోటీల్లో పాల్గొన్నారు.
News November 13, 2025
నిరూపిస్తారా.. క్షమాపణ చెబుతారా: మిథున్

AP: మంగళంపేట భూముల విషయంలో పవన్ కళ్యాణ్ ద్వేషపూరితంగా తమపై <<18274471>>ఆరోపణలు<<>> చేస్తున్నారని YCP MP మిథున్ రెడ్డి ఫైరయ్యారు. ‘ఆ భూమిని 2000లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పుడు అధికారంలో ఉంది మేం కాదు. ఆ భూమి డాక్యుమెంట్ ఆన్లైన్లో ఉంది. ఎవరైనా చూడవచ్చు. మీ ఆరోపణలను నిరూపిస్తారా లేదా క్షమాపణ చెబుతారా’ అని సవాల్ విసిరారు. గతంలో ఎర్రచందనం విషయంలో సవాల్ చేస్తే పారిపోయారని విమర్శించారు.


