News October 23, 2024
పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
Similar News
News November 14, 2025
WATER SCARCITY.. ఆరుతడి పంటలే వేయాలి: కృష్ణాడెల్టా CE

AP: 2026 మే వరకు సాగు, తాగు అవసరాలకు 228 TMCల నీరు అవసరమని కృష్ణాడెల్టా CE రాంబాబు తెలిపారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వినియోగించినది పోగా AP వాటా ఇంకా 118 TMCలే ఉంది. పులిచింతలలోని 40 TMCలను కలిపితే మొత్తం 158TMCలు అందుబాటులో ఉంది. ప్రస్తుత అవసరాలను దీనితోనే తీర్చాలి’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు.
News November 14, 2025
యూఏఈపై భారత్-ఎ విజయం

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.
News November 14, 2025
ఏపీ ఉక్కురంగంలో జపాన్ పెట్టుబడులు: ఓనో కేయిచ్చి

AP: విశాఖ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనో కేయిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని CM కోరారు. CII సమ్మిట్లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


