News April 27, 2024

ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలి: కూటమి నేతలు

image

AP: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎస్ జవహర్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో సీఎస్‌ను కలిసిన కూటమి నేతలు.. ‘మే నెల పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరాం. వచ్చే నెల పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలి. ప్రభుత్వ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 21, 2025

బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్

image

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్‌ ఎంటర్ అయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్‌ కుమారి ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.

News November 21, 2025

కొత్త టీచర్లకు సెలవులు ఇలా..

image

AP: మెగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కొత్త టీచర్లకు సెలవులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 3న వీరు విధుల్లో చేరగా డిసెంబర్ వరకు వర్తించే ప్రపోర్షనేట్ సెలవులను వెల్లడించింది. 4 CL(క్యాజువల్ లీవ్), 1 OH(ఆప్షనల్ హాలిడే), 2 SPL CL(స్పెషల్ క్యాజువల్ లీవ్), మహిళలు అదనంగా ఒక స్పెషల్ CL వినియోగించుకోవచ్చని తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఎంపికైన విషయం తెలిసిందే.