News December 12, 2024
వారికీ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Similar News
News December 12, 2024
షేర్‌మార్కెట్: ఆ తప్పు ఖరీదు 4 నిండు ప్రాణాలు (2)
షేర్లలో అప్పుచేసి ఎప్పుడూ పెట్టుబడి పెట్టొద్దు. డబ్బు లేకుంటే నెలకు కొంత పక్కన పెట్టుకొని కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు నిపుణుల వద్ద ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ నేర్చుకోవాలి. లాభనష్టాలు, నష్టభయంపై అవగాహన తెచ్చుకోవాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్, సపోర్టు, రెసిస్టెన్సీ, కన్సాలిడేషన్, కరెక్షన్, అక్యూములేషన్, మార్కెట్ కండీషన్స్ తెలుసుకొని చిన్నగా ఆరంభించాలి. అనుభవం వచ్చాక పొజిషన్ సైజ్ పెంచుకోవచ్చు.
News December 12, 2024
రోహిత్ శర్మ టెస్టులకు పనికిరాడు: మాజీ క్రికెటర్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో హీరో, విదేశాల్లో జీరో అని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ఎద్దేవా చేశారు. ఫ్లాట్ ట్రాక్‌లపై మాత్రమే ఆయన ఆడతారన్నారు. ‘రోహిత్ ఫిట్‌గా కనిపించడం లేదు. కోహ్లీ ఫిట్నెస్తో పోలిస్తే హిట్‌మ్యాన్ చాలా వెనుకబడ్డారు. ఆయన అధిక బరువుతో సతమతమవుతున్నారు. 5 రోజుల పాటు సాగే టెస్టుల్లో ఆడేందుకు రోహిత్ పనికిరాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 12, 2024
జమిలి ఎన్నికలతో ఎవరికి ఎఫెక్ట్?
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల వాదన. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికతో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడి స్థానిక పార్టీలు పత్తా లేకుండా పోతాయని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే రాష్ట్రాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలతో స్థానిక అంశాలు, సమస్యలు మరుగునపడుతాయని చెబుతున్నారు.