News May 4, 2024
వారికి రేపు, ఎల్లుండి పెన్షన్లు పంపిణీ

AP: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అయితే బ్యాంకు అకౌంట్లు యాక్టివ్‌గా లేని 74,399 మందికి డీబీటీ ద్వారా నగదు జమ కాలేదు. వీరందరికీ నేరుగా నగదును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను పెన్షన్ యాప్ నందు అప్డేట్ చేశారు. వీరందరికీ పెన్షన్లు అందజేసే ప్రక్రియను 4, 5 తేదీల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News October 26, 2025
కొమురం భీమ్ గురించి తెలుసుకోండి: మోదీ

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.
News October 26, 2025
KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్!

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్‌గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


