News June 29, 2024
బీజేపీకి ప్రజలే సమాధానం చెప్తారు: హేమంత్ సోరెన్

ఈ ఏడాది చివర్లో జరిగే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి తగిన సమాధానం చెప్తారని మాజీ CM <<13524683>>హేమంత్<<>> సోరెన్ అన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో తనను బీజేపీ అరెస్ట్ చేయించిందని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన అరెస్టు ఆదివాసీలు, పేదవారు, రైతులను అణచివేయడమేనని తెలిపారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే విషయమై తర్వాత ఆలోచన చేస్తానన్నారు.
Similar News
News October 11, 2025
Lunch Break: భారత్ స్కోరు 427/4

వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 427/4 స్కోరు చేసింది. తొలి సెషన్లో 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జైస్వాల్ (175) రనౌట్ కాగా, నితీశ్ (43)ను వారికన్ ఔట్ చేశారు. కెప్టెన్ గిల్, జురెల్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. గిల్ (75) సెంచరీ దిశగా సాగుతున్నారు.
News October 11, 2025
నేషనల్, ఇంటర్నేషనల్ అప్డేట్స్…

* ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దేశ PMగా సెబాస్టియన్ లెకోర్నోను మళ్లీ నియమించారు. లెకోర్నో కేబినెట్ కూర్పు వివాదంతో 4 రోజుల క్రితం రాజీనామా చేశారు.
* చైనాపై ప్రస్తుత టారిఫ్లకు అదనంగా మరో 100% సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది అమెరికా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
* పిల్లల మరణానికి కారణమైన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది.
News October 11, 2025
మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్చర్కు సరిపోయేలా ఉండాలి. డార్క్సర్కిల్స్కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్లైనర్, లిప్స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>