News August 14, 2024

కాంగ్రెస్ విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు: BRS

image

తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాష్ట్ర తొలి CM, ప్రధాన ప్రతిపక్ష నేత KCR పేరుని ఆహ్వాన పత్రికలో చివర్లో పెట్టి రేవంత్ సర్కార్ తమ కుంచిత స్వభావాన్ని బయటపెట్టిందని BRS విమర్శించింది. మెదక్ జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ ఆహ్వాన పత్రికలో MPలు, MLCల తర్వాత KCR పేరు పెట్టి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని పేర్కొంది. కాంగ్రెస్ విపరీత బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే జవాబు చెబుతారంది.

Similar News

News January 21, 2025

సంచలనం: కుటుంబసభ్యులకు బైడెన్ క్షమాభిక్ష

image

అధికారం నుంచి దిగిపోయే 20 ని.ల ముందు బైడెన్ తన కుటుంబానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్ష ప్రకటించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని, ట్రంప్ రాజకీయ దాడులకు బలవుతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. క్షమాభిక్ష పొందినవారిలో బైడెన్ సోదరుడు జేమ్స్, అతడి భార్య సారా, బైడెన్ సోదరి వలేరి, ఆమె భర్త జాన్, బైడెన్ మరో సోదరుడు ఫ్రాన్సిస్ ఉన్నారు. 2024 DECలోనూ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించారు బైడెన్.

News January 20, 2025

మొబైల్ రీఛార్జ్‌లపై GOOD NEWS

image

రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్‌‌గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్‌‌గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్‌వర్క్‌ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

News January 20, 2025

ట్రంప్ వ్యక్తిగత సమాచారం

image

డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకొని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.