News March 16, 2024

ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ

image

TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News April 5, 2025

రేపు అక్కడ వైన్స్ బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు మూసేయాలని HYD రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్బులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని విధిగా పాటించాలని కోరింది.

News April 5, 2025

తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌పై కోచ్ ఏమన్నారంటే?

image

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయం చర్చనీయాంశమైన వేళ కోచ్ జయవర్దనే స్పందించారు. ‘సూర్య ఔట్ అయినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్ రన్స్ చేస్తాడని చివరి ఓవర్ల వరకు వేచి చూశాం. కానీ, అతను బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు కొత్త బ్యాటర్ అవసరమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అది వ్యూహాత్మక నిర్ణయం’ అని అన్నారు.

News April 5, 2025

ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.

error: Content is protected !!