News February 24, 2025
కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారు: రేవంత్ రెడ్డి

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని చెబుతుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీ అని చెప్పుకునేందుకు బీఆర్ఎస్కు అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ను ప్రజలు తిరస్కరించారన్నారు.
Similar News
News December 1, 2025
చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.


